English | Telugu
'VD12' టైటిల్ ఫిక్స్.. ఇంత పవర్ ఫుల్ టైటిలా..!
Updated : Jan 30, 2025
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'VD12' (వర్కింగ్ టైటిల్). కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న విజయ్, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా 'VD12'పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఇక ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ లాక్ అయింది.
'VD12' మూవీ టైటిల్ ను లాక్ చేసినట్లు నిర్మాత నాగవంశీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "మీ అందరి అబ్యూసెస్ తర్వాత, నేను గౌతమ్ ని చాలా హింస పెట్టాక, ఫైనల్ గా టైటిల్ ను లాక్ చేశాం. త్వరలోనే టైటిల్ ను రివీల్ చేస్తాం." అని నాగవంశీ తెలిపారు. అయితే ఈ సినిమాకి 'సామ్రాజ్యం' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి తొలి వారంలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. 'సామ్రాజ్యం' అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్. మరి పవర్ ఫుల్ టైటిల్ తో విజయ్-గౌతమ్ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతుందో చూడాలి.
ఇక 'VD12' సినిమా విడుదల విషయానికొస్తే, మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ తేదీకి సినిమా రాకపోవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ తాము నిర్మిస్తున్న మరో మూవీ 'మ్యాడ్ స్క్వేర్'ను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేసింది. దీంతో 'VD12' వాయిదా దాదాపు ఖరారైంది. ఈ సినిమాని మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో టైటిల్ తో పాటు, కొత్త రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
