English | Telugu

పూజా హెగ్డే రీ ఎంట్రీ.. టాలీవుడ్ లో మళ్ళీ బిజీ అవుతుందా?

అప్పట్లో టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. కొన్నేళ్ల నుంచి అసలు తెలుగు సినిమాల్లో కనిపించడమే మానేసింది. చివరిగా 2022లో వచ్చిన 'ఆచార్య'లో నటించిన పూజ.. అదే ఏడాది వచ్చిన 'ఎఫ్-3'లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఎందుకనో ఆమె నుంచి శ్రీలీల చేతికి వెళ్లిపోయాయి. ఈ రెండు మూడేళ్ళుగా పూజ హిందీ, తమిళ సినిమాలకే పరిమితమైంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తోంది. (Pooja Hegde Joins DQ41)

దుల్కర్ సల్మాన్ తన 41వ సినిమాని తెలుగులో చేస్తున్నాడు. ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి నెలకుడిటి దర్శకుడు. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇటీవల లాంచ్ అయిన ఈ మూవీ.. హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ వీడియో చూస్తుంటే పూజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. దుల్కర్-పూజ కెమిస్ట్రీ, విజువల్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమాతో మళ్ళీ పూజ తెలుగులో ఫుల్ బిజీ అవుతుందేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.