English | Telugu

మాతో పెట్టుకోకండి.. ఐబొమ్మ వార్నింగ్!

ఇటీవల మూవీ పైరసీ గ్యాంగ్ ను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పైరసీ సినిమాలకు అప్లోడ్ చేసే ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే ఐబొమ్మ నిర్వాహకులు భయపడకపోగా.. రివర్స్ లో వాళ్ళే వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

"మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం" అంటూ ఐబొమ్మ పేరుతో ఓ వార్నింగ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మీరు మా మీద ఫోకస్ పెట్టడం ఆపేసి.. థియేటర్లలో సినిమాలని కెమెరాతో రికార్డు చేసి, రిలీజ్ చేసే వెబ్ సైట్స్ పై దృష్టి పెట్టండని ఐబొమ్మ రాసుకొచ్చింది. హీరోలకు అంతంత రెమ్యూనరేషన్స్ ఇస్తుంటారు, సినీ కార్మికులకు మాత్రం కూలి పనులను వెళ్ళినా వచ్చే అంత ఇస్తారని నిర్మాతలకి చురకలు వేసింది. అనవసరమైన బడ్జెట్ పెట్టి, దానిని రికవర్ చేసుకోవడానికి టికెట్ రెట్లు పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని ఐబొమ్మ పేర్కొంది. ఐబొమ్మ అనేది సిగరెట్ నుంచి ఈసిగరెట్ కి యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. బురదలో రాయి వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా.. భారతదేశం, అందులో తెలుగువారి కోసం ఆలోచిస్తాము అంటూ ఐబొమ్మ రాసుకొచ్చింది.

ఐబొమ్మ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు ఈ కేసుని మరింత సీరియస్ గా తీసుకునే అవకాశముంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.