English | Telugu

పీక‌ల్లోతు అప్పుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌??

మొన్న‌టికి మొన్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అప్పుల్లో ఉన్నార‌ని, ఆయ‌న ఆస్తులు వేలం వేస్తున్నార‌ని చెబితే అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. సూప‌ర్ స్టార్ కి అప్పులేంటి?? అని నోరెళ్ల‌బెట్టారు. టాలీవుడ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌దీ అదే ప‌రిస్థితి అని లేటెస్ట్ టాక్‌. ఔను.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్పుల్లో ఉన్నాడ‌ట‌. ఆ అప్పులు తీర్చ‌డానికి త‌న‌కు ఇష్టం లేక‌పోయినా సినిమాలు చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. పీవీపీ సంస్థ ద‌గ్గ‌ర ప‌వ‌న్ దాదాపు రూ.15 కోట్లు అప్పుగా తీసుకొన్నాడ‌ట‌. ఇంకా ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌ల ద‌గ్గ‌ర ఇంతే మొత్తం అడ్వాన్సులుగా అందుకొన్నాడ‌ట‌. ఇప్పుడు ఆ అప్పులు తీర్చ‌డానికే సినిమాలు చేస్తున్నాడట. ఇటీవ‌ల ఓ సినిమా కోసం అడ్వాన్సు తీసుకొని పీవీపీకి కొంత జ‌మ చేశాడ‌ట‌. ప‌వ‌న్‌కి సినిమాల‌పై ఆస‌క్తి త‌గ్గింద‌ని, అయితే అప్పులు తీర్చ‌డానికే ఆయ‌న సినిమాలు చేస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారమ్‌. ఒకొక్క సినిమాకీ ప‌వ‌న్ తీసుకొనే పారితోషికం దాదాపుగా రూ.15 కోట్ల‌కు పైనే ఉంటుంది. యేడాదికి ఒక్క సినిమా లెక్క‌న క‌నీసం రూ.15 కోట్ల ఆదాయం ప‌వ‌న్‌ది. అయితే... ఖ‌ర్చులు మాత్రం దానికి రెండింత‌లు చేసుకొంటూ వెళ్లిపోతుండ‌డంతో అప్పులు మిగిలాయ‌ని చెప్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ బీజేపీ, టీడీపీ ద్వ‌యానికి త‌న స‌హాయ స‌హ‌కారాలు అందించాడు. అందుకోసం రూ.500 కోట్ల వ‌ర‌కూ ప‌వ‌న్‌కి గిట్టుబాటు అయ్యింద‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. ఈ లెక్క‌న ఆ రూ.500 కోట్ల వ్య‌వ‌హారం అంతా అబ‌ద్ద‌మ‌న్న‌మాట‌..!