English | Telugu

మూణ్ణెల్లలో పవన్ ది షాడో పూర్తి

మూణ్ణెల్లలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే "ది షాడో" చిత్రాన్నిపూర్తిచేయనున్నాడట. వివరాల్లోకి వెళితే తమిళంలో ప్రముఖ దర్శకుడు విష్ణు వర్థన్ తొలిసారిగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజైన్, జియాఖాన్ హీరోయిన్లుగా నటిస్తూండగా, విష్ణు వర్థన్ దర్శకత్వంలో "ది షాడో" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ "ది షాడో" చిత్రాన్నివిష్ణు వర్థన్ తన సహజ శైలిలో తొంభై రోజుల్లోనే పూర్తి చేయనున్నాడట. ఎందుకంటే విష్ణువర్థన్ తమిళంలో తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమానీ కేవలం ముణ్ణెల్లలోనే పూర్తి చేయటం రివాజట. విష్ణువర్థన్ కి తమిళ సినీ పరిశ్రమలో మిస్టర్ పర్ ఫెక్ట్ గా చాలా మంచి పేరుంది.


తమిళంలో తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో అత్యధిక శాతం సూపర్ హిట్లుండటమే అందుకు కారణం. అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్ లో సినిమాని తీయటంలో దర్శకుడు విష్ణు వర్థన్ మొనగాడని కోలీవుడ్ వర్గాలంటూంటాయి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రం కేవలం షుటింగ్ మొదలుపెట్టిన తొంభై రోజులకే పూర్తికానుందన్నమాట. ఎందుకంటే ఒక సినిమా పూర్తిచేయటానికి దర్శకుడు విష్ణు వర్థన్ మూడు నెలలకు మించి సమయం తీసుకోడట. ఈ చిత్రం ఏప్రెల్ నెలలోనే ప్రారంభమయ్యే సూచనలున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.