English | Telugu

ఎన్టీఆర్ సినిమా టైటిల్ - దండ‌యాత్ర‌?

హిట్ సినిమాలోని పాట‌లు, డైలాగులూ.. ఆ త‌రువాత టైటిళ్లుగా చ‌లామ‌ణీ అవుతుంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ టైటిల్ కూడా అలానే పుట్టింది. టెంప‌ర్ సినిమాలో ''దండ‌యాత్ర.. ఇది ద‌యాగాడి దండయాత్ర‌'' అంటూ రెచ్చిపోయి డైలాగులు ప‌లికాడు ఎన్టీఆర్‌. టీజ‌ర్ ఎప్పుడైతే విడుద‌లైందో అప్ప‌టి నుంచీ ఈ డైలాగ్ పాపుల‌ర్ అయిపోయింది. చెప్పిన‌ట్టే ఎన్టీఆర్ కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర దండ‌యాత్ర చేశాడు. ఇప్పుడు ఈ దండ‌యాత్ర అనే ప‌ద‌మే సినిమా టైటిల్‌గా మారిపోయింది. ఎన్టీఆర్ - సుకుమార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొద‌లెడ‌తారు. ఈ చిత్రానికి దండ‌యాత్ర అనే పేరు ఖ‌రారు చేసిన‌ట్టు టాక్‌. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లోబోతోంది. లండ‌న్‌లో కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తారట‌. దాదాపు 50 శాతం షూటింగ్ అక్క‌డే జ‌ర‌గ‌బోతోంది. దండ‌యాత్ర‌.. ఈ టైటిల్‌కి త‌గిన‌ట్టుగానే సినిమాలో యాక్ష‌న్ సీన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న‌ట్టు తెలుస్తోంది.