English | Telugu

మెగా హీరోతో పోటీకి వస్తున్న'చిన్నది'

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ముకుంద’ సినిమా క్రిస్మస్‌ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మొదట ఈ సినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ వరుణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా 'గోపాల గోపాల' రిలీజ్ కాబోతుండ౦తో పోటీ ఇష్టం లేక క్రిస్మస్‌ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా సడన్ గా మరో సినిమా పోటీకి వచ్చింది. ఆ సినిమా ఎవరిదో కాదు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అను చెప్పుకొనే నితిన్ ‘చిన్నదాన నీకోసం’ సినిమా.


నితిన్‌ నటించిన ‘చిన్నదాన నీకోసం’ సినిమాను మొదట డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలను అనుకున్నారు. ఇప్పుడు రిలీజ్‌ వారం రోజుల పాటు పోస్ట్‌పోన్‌ అయి క్రిస్మస్‌కి వెళ్లింది. ఈ చిత్రం డిసెంబర్‌ 25న రిలీజ్‌ అవుతుందని నితిన్‌ ప్రకటించాడు. కరుణాకరన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. రెండూ యూత్‌ కమ్‌ క్లాస్‌ ఎంటర్‌టైనర్స్‌ కనుక ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైతే ఇరు చిత్రాలకీ ఎంతో కొంత డ్యామేజ్‌ ఉంటుంది. మరి ఈ రెండు సినిమాల నిర్మాతలు కాంప్రమైజ్‌ అవుతారా లేక అమీ తుమీ తేల్చుకోడానికే సై అంటారా?

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.