English | Telugu

చిన్నదాన నీకోసం ఇండస్ట్రీ రిపోర్ట్

నితిన్ చిన్న‌దాన నీకోసం అంటూ ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈసినిమాపైనా మంచి అంచ‌నాలే ఉన్నాయి. కార‌ణం... నితిన్ మంచి ఊపుమీదున్నాడు. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, హార్ట్ ఎటాక్‌... ఇలా త‌న‌కు న‌ప్పే క‌థ‌ల్ని ఎంచుకొంటున్నాడు. ఆ ఫామ్ ఈ సినిమాకి బీభ‌త్స‌మైన ఓపెనింగ్స్ తీసుకురావ‌డం ఖాయం. దానికి తోడు క్రిస్మ‌స్ సెల‌వ‌లూ కలిసొస్తాయి. క‌రుణాక‌ర‌న్ బ్రాండ్ ఈ సినిమాపై ప‌డింది. వెర‌సి... ప్రారంభ వ‌సూళ్ల‌కు ఢోకా ఉండదు. నితిన్ ఎన‌ర్జీ, వినోదం ఈసినిమాకి ప్ల‌స్ పాయింట్స్‌. అయితే సెకండాఫ్ ట్రాక్ త‌ప్పింద‌ని ల్యాబ్ రిపోర్ట్. అనూప్ మ్యూజిక్ అంత‌గా ప్ల‌స్ కాలేద‌ట‌. కాక‌పోతే క‌నీసం యావ‌రేజ్ స్థాయిలో నిల‌బ‌డే ఛాన్సుంద‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల్ని ఈ సినిమా త‌ల‌కిందులు చేస్తుందా, లేదంటే యావ‌రేజ్ సినిమాగా మిగిలిపోతుందా? తెలియాలంటే రేపటి వరకు ఆగాలి.