English | Telugu

తార‌క్ హీరోయిజానికి 21 ఏళ్ళు!

ఈ త‌రం క‌థానాయకుల్లో `ఆల్ రౌండ‌ర్`గా ప్ర‌త్యేక గుర్తింపు పొందారు.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్. అలాంటి తార‌క్ కి మే 25 ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే.. 21 ఏళ్ళ క్రితం అంటే 2001లో ఇదే రోజున ఎన్టీఆర్ హీరోగా న‌టించిన మొద‌టి సినిమా `నిన్ను చూడాల‌ని` జ‌నం ముందు నిలిచింది. దిగ్గ‌జ నిర్మాణ సంస్థ ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ ని.. `నువ్వు వ‌స్తావ‌ని` (2000) వంటి సెన్సేష‌న‌ల్ హిట్ తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన‌ వీఆర్ ప్ర‌తాప్ రూపొందించారు. ఇందులో తార‌క్ కి జోడీగా నూత‌న క‌థానాయిక‌ ర‌వీనా రాజ్ పుత్ న‌టించ‌గా.. కె. విశ్వ‌నాథ్, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, అన్న‌పూర్ణ‌, రాళ్ళ‌ప‌ల్లి, సుధ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

మెలోడీ స్పెష‌లిస్ట్ ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత‌మందించిన ఈ చిత్రానికి వేటూరి సుంద‌రరామ్మూర్తి, `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ‌, భువ‌న‌చంద్ర‌, చంద్ర‌బోస్ సాహిత్యమందించారు. ``ఊపిరొచ్చిన బాపు బొమ్మ‌``, ``ఏ చోట నేనున్నా``, ``ఎన్నాళ్ళో వేచాక‌``, ``ముద్ద‌బంతి పువ్వ‌మ్మో``, ``ఏమైందో ఏమోగానీ``, ``క్యాంప‌స్ లో కాలెట్టి``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. 2001 మే 25న విడుద‌లైన `నిన్ను చూడాల‌ని` బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌న‌ప్ప‌టికీ.. ఎన్టీఆర్ కి నటుడిగా మంచి గుర్తింపునే తీసుకువ‌చ్చింది. కాగా, నేటితో తార‌క్ హీరోయిజానికి 21 ఏళ్ళు పూర్తయ్యాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.