English | Telugu

అంతా 'నాన్నకు ప్రేమతో' మయం!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' ఆడియో పాటలు విడుదలైన నాటి నుంచె చార్ట్ బస్టర్స్ అయిపోయాయి. మార్కెట్ లో ఎక్కడ చూసిన ఆటోల్లో, బస్సుల్లో, కార్లలో ఇవే పాటలు వినిపిస్తున్నాయి. జనాలకు చాలా క్యాచీగా ఉండే ట్యూన్ కావడంతో ఇన్ స్టంట్ గా ఎక్కేస్తున్నాయి.

దేవిశ్రీ ఈ సినిమా కోసం ఐదు డిఫరెంట్ పాటలు ఇచ్చాడు. ఎన్టీఆర్ ఆడియోల కంటే 'నాన్నకు ప్రేమతో' ఆడియో కొంచెం డిఫరెంట్ గా వుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మాములుగానే దేవిశ్రీ, సుకుమార్ కాంబినేషన్ అంటే ఆడియోపై అంచనాలు ఎక్కువగా వుంటాయి. ఈ సారి వీరికి ఎన్టీఆర్ జతకవడంతో పాటలు ఎలా వుండబోతున్నాయోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఇప్పుడు ఈ పాటలకు వెండితెరపై ఎన్టీఆర్ జోష్ ఫుల్ స్టెప్స్ తోడైతే అభిమానులకు పండగే పండగ!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.