English | Telugu
విక్రమ్ ‘ఇరు ముగన్’ ఫస్ట్ లుక్
Updated : Jan 11, 2016
విక్రమ్ ‘ఇరు ముగన్’ ఫస్ట్ లుక్ టైటిల్ ప్రకటించారు. ఈ పోస్టర్ సినిమా మీద విపరీతమైన ఆసక్తి రేపేలా ఉంది. చాలా డిఫరెంటుగా అనిపిస్తున్న ఈ పోస్టర్.. సినిమా మీద అయితే ఎలాంటి ఐడియా ఇవ్వట్లేదు. ఓవైపు విక్రమ్ ముఖం సగం మామూలుగా ఇంకో సగం వ్యోమగామి తరహాలో కనిపిస్తోంది. మొత్తానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ కావచ్చేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. వరుసగా ప్రయోగాలు చేసి ఎదురు దెబ్బలు తింటున్నప్పటికీ విక్రమ్ ఏమాత్రం వెనుకంజ వేయట్లేదని ఈ లుక్ ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తుండటం విశేషం.