English | Telugu

షిర్డి సాయిబాబాగా నాగార్జున

షిర్డి సాయిబాబాగా నాగార్జున నటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే షిర్డీ సాయిబాబాగా యువ సామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున నటించబోతున్నారట. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించబోతున్నారట. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో "అన్నమయ్య", "శ్రీరామదాసు" వంటి భక్తిరసభరిత చిత్రాలు వచ్చాయి. ఆ రెండు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ముందు "అన్నమయ్య" చిత్రం నిర్మాణంలో ఉండగా ఆ చిత్రం గురించి ప్రేక్షకుల నుంచీ, సినీ పండితుల నుంచీ, సినీ విమర్శకుల నుంచీ చాలా దారుణమైన విమర్శలు వచ్చాయి. "అన్నమయ్యకు మీసాలేమిటి...? అయినా శివ వంటి సినిమాలో సైకిల్ చైన్ పట్టుకుని ఫైటింగులు చేసే నాగార్జున అన్నమయ్య వంటి పరమ పవిత్ర వాగ్గేయకారుడి వేషం వేయటమా...? హీరోయిన్ల బొడ్డు మీద పళ్ళూ పాలూ వేసి, వారి అందాలను ఎక్స్ పోజింగ్ చేసే రాఘవేంద్రరావు భక్తిరస ప్రథానచిత్రం తీయటమా...? అంటూ నానా గొడవ చేశారు. కానీ "అన్నమయ్య" సినిమా విడుదలయ్యాక విమర్శకులందరి నోళ్ళు మూతపడ్డాయి. ఈ రోజున " అన్నమయ్య " డి.వి.డి. లేని తెలుగిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ షిర్డీ సాయిబాబా చిత్రం నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో రాబోతున్న హేట్రిక్ భక్తిరసచిత్రం. ఈ చిత్రంలో సాయిబాబా గెటప్ లో ఉన్న నాగార్జున స్టిల్ మీరు చూడవచ్చు. బహుశా "రాజన్న" చిత్రం తర్వాత ఈ సాయిబాబా సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.