English | Telugu

కృష్ణవంశీకీ నాగార్జున‌కీ మ‌ధ్య క్లాష్ ఎందుకు...?

నిన్నే పెళ్లాడ‌తా సినిమాని నాగార్జున ఎప్పటికీ మ‌ర్చిపోలేడు. అఫ్ కోర్స్ కృష్ణవంశీ కూడా. కృష్ణవంశీ ఫ్యామిలీ డ్రామాలు ఎంత బాగా తీస్తాడో ఆ సినిమా తో ప‌రిశ్రమ‌కు అర్థమైంది. చంద్రలేఖ ఫ్లాప్ అయినా - మంచి సినిమానే. ఈ రెండు సినిమాల‌తో కృష్ణవంశీ, నాగార్జున మ‌ధ్య విప‌రీత‌మైన రాపో పెరిగిపోయింది. అయితే... స‌డ‌న్‌గా ఈ బంధం బీట‌లు వారింది. ఇద్దరి మ‌ధ్య `ఇగో` క్లాష్ అయ్యింది. ముచ్చట‌గా మూడో సినిమా ప‌ట్టాలెక్కక‌ముందే ఆగిపోయింది. ఆ క్లాష్ ఇప్పటికీ కొన‌సాగుతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాల మాట‌.

అక్కినేని నాగేశ్వర‌రావు, నాగార్జున‌, నాగ‌చైత‌న్య ఈ ముగ్గురి కోసం కృష్ణవంశీ ఓ క‌థ త‌యారు చేశాడు. అదే... త్రయం. ఈ కథ‌ని అక్కినేని కుటుంబం దాదాపుగా ఓకే చేసేసింది. ఈ ప్రాజెక్టుపై వంశీ యేడాది క‌ష్టప‌డ్డాడు కూడా. చివ‌రి క్షణాల్లో నాగ్‌... ఈ స్ర్కిప్ట్‌ని ప‌క్కన పెట్టాడ‌ట‌. నాగ్ నిర్ణయంతో వంశీ శ్రమంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. ఒక ద‌శ‌లో వంశీ ఫోన్ చేసినా.. నాగ్ స‌మాధానం ఇవ్వలేద‌ని దాంతో వంశీ చాలా ప‌ర్సన‌ల్‌గా ఫీల‌య్యాడని, గోవిందుడు అంద‌రివాడేలే టీజ‌ర్ ఆవిష్కర‌ణ స‌భ‌లో వంశీ కంట‌త‌డి పెట్టుకోవ‌డానికి కార‌ణం కూడా అదేన‌ని ఇన్‌సైడ్ రిపోర్ట్‌. ఆ త‌ర‌వాత అక్కినేని ఫ్యామిలీ మ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. త్రయం క‌థ‌నే అటూ ఇటూ మార్చి గోవిందుడు అంద‌రివాడేలే సినిమా తీశాడు వంశీ. అయినా ఇద్దరి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్లేద‌ట‌. ఇప్పటికీ అంటీముట్టన‌ట్టుగానే ఉన్నార్ట. నాగ్ వ‌దిలేసిన క‌థ‌ని చ‌ర‌ణ్‌కి చెప్పి, చిరుతో ఒప్పించి, ఇప్పుడో మంచి చిత్రంగా మ‌ల‌చ‌గ‌లిగాడు వంశీ. ఈ విష‌యంలో నాగ్‌పై విజ‌యం సాధించాన‌న్న తృప్తి... వంశీలో క‌నిపిస్తోందిప్పుడు. రాజ‌కీయాల్లోనే కాదు, సినిమాల్లోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శ‌త్రువులు ఉండ‌రు. విజ‌యాల వెంట ప‌డ‌డ‌మే ఉంటుంది. మ‌రిప్పుడైనా నాగ్‌, వంశీల మ‌ధ్య క‌మ్యునికేష‌న్ గ్యాప్‌కి తెర ప‌డుతుందా?? మ‌ళ్లీ ఇద్దరూ క‌లుస్తారా? అన్నది కాల‌మే చెప్పాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.