Read more!

English | Telugu

వాళ్ళ పాలసీ నచ్చకే వచ్చేసాను... రీ-ఎంట్రీ అనేది ఉండదు

జబర్దస్త్ కి రీ-ఎంట్రీ ఇచ్చేది లేదు అన్నారు నాగబాబు. జబర్దస్త్ అంటే ఇప్పటికీ గుర్తొచ్చే వాళ్లలో నాగబాబు కూడా ఒకరు. ఈ పదేళ్లలో ఎప్పుడూ రానంత పేరు పేరు బుల్లితెర షో జబర్దస్త్ అలాగే మిగతా కామెడీ షోస్ వల్ల వచ్చాయన్నారు నాగబాబు ఒక ఇంటర్వ్యూలో. " ఇంత పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది కానీ నేను జబర్దస్త్ లోకి మళ్ళీ వెళ్లడం అనేది జరగదు. నాకు నేనుగా వాలంటరీగా ఆ షో నుంచి బయటకి వచ్చేసాను.

అలా వచ్చాను కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్లడం అనేది ఉండదు. వాళ్లకు నా అవసరం ఉంటే ఆలోచిస్తాను కానీ నాకు నేను వెళ్లి అడగడం అనేది జరగని పని. శ్యామ్ తో నాకేమీ గొడవలు లేవు. కానీ అప్పట్లో కింద ఉన్న స్టాఫ్ తాలూకా ఆటిట్యూడ్ కారణంగా నేను ఆ షోకి దూరం కావాల్సి వచ్చింది. నా కుర్రాళ్లకు ఆ షోలో సరైన న్యాయం జరగలేదు అనిపించే నేను బయటకు వచ్చేసాను. అంతేకాని నాకు అక్కడ ఎవరితో ఎలాంటి ఇష్యూస్ లేవు.  

వాళ్ళ పాలసీ వాళ్లకు ఉంటుంది. నేను దాన్ని తప్పు పట్టను. కానీ ఆ పాలసీలో ఇమడలేను అనిపించింది అందుకే నేను దూరంగా వచ్చేసాను. " అని చెప్పారు నాగబాబు. ఆయనతో పాటు అప్పట్లో ఎంతో మంది కమెడియన్స్ కూడా బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. అలా ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేయడం వలన ఆ షోకి ఉన్న ఫాలోయింగ్ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి.