English | Telugu

వివాదానికి తెరతీసిన నాగ్ అశ్విన్.. ఇలాంటివి అవసరమా..?

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ, జూన్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కేవలం రెండు సినిమాల అనుభవమున్న నాగ్ అశ్విన్.. ఈ అద్భుతం సృష్టించడంతో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో అనవసరమైన వివాదానికి తెరతీశాడు నాగ్ అశ్విన్.

'కల్కి' మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో ఆయన రాసినది కాంట్రవర్సీ అవుతోంది. రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందంటూ నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్ పరోక్షంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో నాగ్ అశ్విన్ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సక్సెస్ ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు ఈ అనవసరమైన కాంట్రవర్సీలు అవసరమా అని కొందరు హితవు పలుకుతున్నారు. మరికొందరేమో, సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'యానిమల్' కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో 'కల్కి' రూపొందిందని.. కానీ 'యానిమల్' రూ.900 కోట్లు కలెక్ట్ చేస్తే, ఎందరో స్టార్స్ తో రూపొందించిన 'కల్కి' రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళదని, అనవసరంగా తోటి డైరెక్టర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.