English | Telugu

సంక్రాంతి కి ఎన్టీఆర్ డబుల్ ధమాకా..!!

ఈ సంక్రాంతి ఎన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్..ఎందుకంటే ఆ రోజు అభిమానులకు ఎన్టీఆర్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. అటు వెండితెర ఇటు బుల్లితెర రెండు చోట్లా అభిమానుల్ని అలరించేందుకు యంగ్ టైగర్ సిద్దమయ్యాడు. జనవరి 13న నాన్నకు ప్రేమతో థియేటర్లలలో సందడి చేయబోతుండగా..అదే బుల్లితెర పాపులర్ 'షో' మీలో ఎవరు కోటీశ్వరుడులో కింగ్ నాగార్జున తో కలిసి హంగామా చేయబోతున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ ఎపిసోడ్ షూట్ కూడా చేసి ..ప్రోమోలు కూడా వదిలారు. ఎన్టీఆర్ ఎనర్జీ .. షో లో ఇచ్చిన ఆన్సర్స్ ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నాయట. అయితే ఎన్టీఆర్ ని ఈ షోలో చూడాలని మీకు ఆసక్తిగా వుందా.. ప్రస్తుతానికి ఈ ప్రోమో చూడండీ..!!

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.