English | Telugu
'డిక్టేటర్' కోసం పొలిటికల్ లీడర్స్ వెయిటింగ్..!!
Updated : Jan 7, 2016
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డిక్టేటర్ కోసం సినీ వర్గాలకంటే...పొలిటికల్ వర్గాలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. తమ పొలిటికల్ ఎత్తుగడలతో ఎప్పుడూ బిజీగా వుండే రాజకీయ నాయకులు..బాలయ్య సినిమా కోసం ఎందుకు ఇంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? ఇక్కడే వుంది అసలు కథ..
బాలయ్య గత కొన్ని సినిమాల్లో పొలిటికల్ పంచ్ లు బాగా ఉంటున్నాయి. లెజెండ్..లయన్ వంటి సినిమాల్లో భారీగానే పంచ్ లు విసిరారు. ఇప్పుడు బాలయ్య ఎమ్మెల్యే కూడా కావడంతో దూకుడు మరింత పెరిగిందట. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో విన్న డైలాగుల కంటే కూడా ‘డిక్టేటర్’లో పొలిటికల్ పంచ్ లు భారీగా వున్నాయని ఇండస్ట్రీ టాక్.
‘డిక్టేటర్’ లో ప్రతిపక్షంపై ఎలాంటి సెటైర్ లు వేశాడో చూద్దామని అధికారపక్షం... తమపై ఎలాంటి సెటైర్ లు పడ్డాయి..వాటిని ఎలా తిప్పికొట్టాలని ప్రతిపక్షం వర్గాలు ఆసక్తిగా జనవరి 14 కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి బాలయ్య 'డిక్టేటర్' తో సినీ వర్గాలనే కాక పొలిటికల్ వర్గాలను తనవైపు తిప్పేసుకున్నాడు.