English | Telugu
ఎన్టీఆర్ విలనా?
Updated : Jul 8, 2015
ఈ టైటిల్ చూడగానే..... ఎన్టీఅర్ విలన్ గా నటిస్తున్నాడా? ఏ సినిమాలో? అయినా ఫామ్ లో ఉన్న హీరోకు విలన్ గా నటించాల్సిన ఖర్మేం పట్టింది? అని వరస ప్రశ్నలు సంధించేయకండి. మేటరేంటంటే యంగ్ టైగర్ లేటెస్ట్ మూవీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందేకదా. ఆ సినిమా కోసం మనోడు గడ్డం పెంచి సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.
టెంపర్లో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన ఎన్టీఆర్ ఈ మూవీలో మొత్తం ఛేంజ్ అయి కనిపిస్తున్నాడు. దీంతో టాలీవుడ్ జనాలంతా కుర్రాడు విలన్ వేషాలేస్తాడేమో అంటున్నారు. ఆ డౌట్ ఎందుకొచ్చిందంటే...సాధారణంగా సుకుమార్ సినిమాలో విలన్ కన్నా హీరోనే విలన్ గా కనిపిస్తాడు. ఆర్య, ఆర్య 2లో అల్లు అర్జున్, జగడంలో రామ్, 100% లవ్ లో చైతూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించారు. దీంతో ప్రస్తుతం యంగ్ టైగర్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తాడని డిస్కస్ చేసుకుంటున్నారు.
మరో విషయం ఏంటంటే....టెంపర్లో దయాగాడి దండయాత్ర అని చెప్పిన డైలాగ్ లో రెండో ముక్కని అదే 'దండయాత్ర'ని సుకుమార్ మూవీ టైటిల్ గా ఫిక్స్ చేశారు. మొత్తానికి వన్ డిజాస్టర్ నుంచి బయటపడేందుకు సుకుమార్.... టెంపర్ ను మించిన హిట్టందుకునేందుకు ఎన్టీఆర్ తెగ ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.