English | Telugu

ఎన్టీఆర్‌.. ఎందుకీ పంతం??

ఈ సంక్రాంతి బ‌రిలో ఎలాగైనా నిల‌వాల్సిందే అనుకొంటున్నాడు ఎన్టీఆర్‌. సంక్రాంతి కోసం సినిమా సిద్ధం చేసుకోవ‌డం త‌ప్పేం కాదు, ఎందుకంటే.. తెలుగు సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ సంక్రాంతి తిరుగులేని సీజ‌న్‌. సినిమా హిట్టు కొడితే.. కోట్లు కొల్ల‌గొట్టొచ్చు. అందుకే సంక్రాంతి బ‌రిలో సినిమాని నిల‌ప‌డానికి ట్రై చేస్తుంటారు. కానీ.. అందుకు స‌రైన ప్ర‌ణాళిక కూడా ఉండాలి. నాన్న‌కు ప్రేమ‌తో విష‌యంలో మాత్రం ఎన్టీఆర్‌కి అలాంటి ప్ర‌ణాళిక‌లేం లేవు. కేవ‌లం బాబాయ్ బాల‌కృష్ణ‌కి పోటీగా త‌న సినిమాని సిద్ధం చేయాల‌నుకొంటున్నాడంతే.

ఎందుకంటే... నాన్న‌కు ప్రేమ‌తో ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. స్పెయిన్‌లో ఓ షెడ్యూల్ తెర‌కెక్కించాలి. కానీ అందుకు అనుమతులు మాత్రం ఇంకా రాలేదు. స్పెయిన్ వెళ్లి, షూటింగ్ చేసుకొని తిరిగొచ్చే స‌రికి.. పొంగ‌ల్ వెళ్లిపోతుంది. అందుకే ఎన్టీఆర్ ఓ ప్లాన్ వేశాడు. స్పెయిన్లో తీయాల్సిన సీన్స్ ని ఇండియాలోనే షూట్ చేసేయండి అంటున్నాడ‌ట‌. అక్క‌డ ఇది వ‌ర‌కు తీసిన సీన్ల‌కు మ్యాచింగ్ కావాలంటే.. సెట్లు వేయండి అంటూ ఆర్డ‌రేశాడ‌ట‌. దాంతో.. చిత్ర‌బృందం ఉరుకులు ప‌రుగుల మీద‌.. స్పెయిన్‌కి మ్యాచింగ్ సీన్లు హైద‌రాబాద్లోనే తీయ‌డానికి ప్ర‌త్యామ్నాయాల‌ను వెదుక్కొంటోంది.

సినిమాని తొంద‌ర‌గా చుట్టేయాల‌న్న కుతూహ‌లంతో సీన్ల‌పై దృష్టి పెట్ట‌డం లేద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. ఇలాగైతే సంక్రాంతికి సినిమాని తీసుకొచ్చేయొచ్చు గాక‌.. కానీ డిక్టేట‌ర్‌కి దీటుగా నిల‌బ‌డ‌తాడా? అనే సందేహం నెల‌కొంది. పంతంతో ఈ సినిమాని కావాల‌ని కిల్ చేసుకొంటున్నాడేమో అనిపిస్తోంది. ప్చ్‌.. ఇలాగైతే నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ఏమైపోతుందో??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.