English | Telugu

సితార చేతికి చైతన్య సినిమా!

ఇటీవల 'తండేల్'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య.. తన తదుపరి సినిమాని 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'NC24' అనేది వర్కింగ్ టైటిల్. ఎస్.వి.సి.సి. బ్యానర్ లో మిథికల్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే షూటింగ్ స్టార్టింగ్ దశలో ఉండగానే.. ఈ సినిమాకి అదిరిపోయే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. (Naga Chaitanya)

సాధారణంగా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడో లేక షూటింగ్ పూర్తయిన తర్వాతనో బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతుంటాయి. కానీ, 'NC24' విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. ఇప్పటిదాకా కేవలం పది శాతం షూటింగ్ పూర్తి కాగా, అప్పుడే థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ.34 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యి, సినిమా విడుదల కావడానికి అటూఇటుగా ఏడాది పడుతుంది. ఈ లెక్కన ఇది నిర్మాతలకు మంచి డీల్ అనే చెప్పాలి.

చైతన్య గత చిత్రం 'తండేల్' రూ.35 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయగా, రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. తండేల్ తర్వాత చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు కావడంతో 'NC24'పై భారీ అంచనాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా తండేల్ ని మించిన వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఈ లెక్కలతోనే 'NC24' రైట్స్ ను నాగవంశీ ముందే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, చైతన్య సోదరుడు అఖిల్ అప్ కమింగ్ మూవీ 'లెనిన్'కి కూడా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .