English | Telugu

ఆ స్టార్ హీరోకి సిస్టర్ గా మృణాల్ ఠాకూర్!

'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ప్రస్తుతం 'డెకాయిట్' అనే సినిమా చేస్తోంది. ఇది 2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగులో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ఇప్పుడు స్టార్ హీరోకి సిస్టర్ గా కనిపించనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.

పుష్పరాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ఫిల్మ్ చేసున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ సహా పలువురు పలువురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకే సినిమాలో ఇంతమంది హీరోయిన్స్ నటించడం ఏంటని కొంతకాలంగా చర్చనీయాశంగా మారింది. ఇక ఇప్పుడు మృణాల్ రోల్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. (AA22)

Also Read: 2025 చివరి బాక్సాఫీస్ వార్.. ఛాంపియన్ ఎవరు..?

ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో మృణాల్ కనిపించనుందట. ఇది సినిమాకి కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. బ్రదర్-సిస్టర్ బాండింగ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ హత్తుకుంటాయట. ఈ ట్రాక్ మూవీ మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుంది అంటున్నారు. అసలే అల్లు అర్జున్-అట్లీ కాంబో, దానికితోడు కథకి కీలకమైన పాత్ర కావడంతో.. సిస్టర్ రోల్ చేయడానికి మృణాల్ సిద్ధపడినట్లు సమాచారం.