English | Telugu

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ హిందీలో

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" హిందీలో పునర్నిర్మిస్తున్నారట. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్". ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమాని హిందీలో పునర్నిర్మిస్తున్నారని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం. గతంలో "బొమ్మరిల్లు" సినిమాకి, ప్రస్తుతం ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" సినిమాకి అబ్బూరి రవి స్క్రిప్ట్ ను అందించారు.

అందుకని అబ్బూరి రవితో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడయాడ్ వాలా సంప్రదిస్తున్నారట. ఇప్పటికే కోన వెంకట్ హిందీ సినీ పరిశ్రమకు వెళ్ళేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సన్నాహాలు చేస్తున్నారు. అలా ఒక మంచి తెలుగు రచయిత హిందీకి వెళుతున్నాడు. అదే బాటలో అబ్బూరి రవి కూడా హిందీ సినీ పరిశ్రమకు వెళ్ళేసన్నాహాలో ఉన్నారని వినిపిస్తూంది. ఇలా ఇద్దరు మంచి రచయితలు తెలుగు సినీ పరిశ్రమకు దూరమవబోతున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.