English | Telugu

మోడీ తర్వాత ఎన్టీఆర్.. ఫ్యాన్స్ హ్యాపీ 

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ 'ఎక్స్'(X)కి ఉన్న ప్రాముఖ్యత అందరకి తెలిసిందే. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా పలు రంగాలకి చెందిన సెలబ్రటీస్, తమ అభిమానులకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంటారు. అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా తమకి నచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి 'ఎక్స్' ని ఒక వేదికగా ఎంచుకుంటారు. ఇప్పుడు ఇందుకు సంబంధించి ఆగష్టు నెలలో 'ఎక్స్' వేదికగా నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకున్న మొదటి పది మంది జాబితాని రిలీజ్ చేసింది.

సదరు జాబితాలో ప్రైమ్ మినిస్టర్ 'నరేంద్ర మోదీ'(Narendra Modi)అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)నిలిచాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. నేషనల్ లెవల్లో ఎన్టీఆర్ కి పెరుగుతున్న క్రేజ్ కి ఇదొక ఉదాహరణ అంటు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడో ప్లేస్ లో ఇళయ దళపతి విజయ్(Vijay),నాలుగో స్థానంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రముఖ క్రికెటర్, శుభ్‌మ‌న్ గిల్ ఐదు, ఆరు, ఏడు,స్థానాల్లో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)8వ స్థానంలో ఉంటే, 9వ ప్లేస్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ఇక పదవ స్థానంలో సూపర్ స్టార్ తలైవా 'రజనీకాంత్'(Rajinikanth)చోటు సంపాదించుకున్నాడు.

'ఎక్స్' యాజమాన్యం ఈ విధంగా ప్రతి నెల, ప్రతీ ఏడాది నెట్టింట అత్యంత ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రటీల లిస్ట్ ప్రకటిస్తు ఉంటుంది. మరి నెక్స్ట్ మంత్ ఎవరు మొదటి పది మంది జాబితాలో ఉంటారో చూడాలి.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.