English | Telugu

గోపీచంద్ మొగుడు షూటింగ్ లో తాప్సి

గోపీచంద్ "మొగుడు" షూటింగ్ లో తాప్సి పాల్గొంటోందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళితే శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువ డైనమిక్ హీరో గోపీచంద్ హీరోగా, తాప్సి హీరోయిన్ గా, కృష్ణ వంశీ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నవిభిన్నమైన సినిమా "మొగుడు". ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఆ మధ్య ఏవో గొడవలయినట్లు వినపడింది. ఆ గొడవల నుండి బయటపడి స్క్రిప్ట్ పూర్తి చేసుకుని ఈ మధ్య ఈ గోపీచంద్ "మొగుడు" సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.

ఈ గోపీచంద్ "మొగుడు" చిత్రం షూటింగ్ లో హీరోయిన్ తాప్సి పాల్గొంటూందట. ఈ గోపీచంద్ "మొగుడు" సినిమాలో హీరో గోపీ చమద్ కి తండ్రిగా సీనియర్ హీరో నటకిరీటి, పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారట. గోపీచంద్ "మొగుడు" సినిమా మన వివాహ వ్యవస్థ నేపథ్యంలో సాగే చిత్రమని సమాచారం. ఈ గోపీచంద్ "మొగుడు" మూవీకి కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారని ముందుగా వినపడింది. కాని కారణాలు తెలియవుకానీ ఈ గోపీచంద్ "మొగుడు" సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతాన్నందింటంలేదు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.