English | Telugu
మీనాక్షి, డింపుల్.. ఆ హీరోయిన్స్ బాటలో వెళతారా?
Updated : Feb 9, 2022
`క్రాక్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా `ఖిలాడి`. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని రమేశ్ వర్మ డైరెక్ట్ చేశారు. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రంలో రవితేజకి జంటగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నాయికలుగా నటించారు. కాగా, ఈ ఇద్దరికీ హీరోయిన్స్ గా ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేదనే చెప్పాలి.
Also Read:'ఖిలాడి'లో అనసూయ క్యారెక్టర్లు.. చంద్రకళ, చాందిని!
`గల్ఫ్`, `యురేక`, `సామాన్యుడు` (తమిళ్ డబ్బింగ్) వంటి చిత్రాల్లో నాయికగా నటించిన డింపుల్ కి ఆయా సినిమాలు నిరాశజనక ఫలితాన్నే అందించాయి. అలాగే `ఇచ్చట వాహనములు నిలుపరాదు`తో హీరోయిన్ గా తొలి అడుగేసిన మీనాక్షికి కూడా మొదటి సినిమా సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో.. `ఖిలాడి` విజయం ఈ ఇరువురికి ఎంతో అవసరం.
Also Read:'బ్లడీ మేరి'గా నివేదా పేతురాజ్ చూపు చూడండి!
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో కళ్యాణి (ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!), సంగీత (ఖడ్గం), అనుష్క (విక్రమార్కుడు), అంజనా సుఖాని (డాన్ శీను), రిచా గంగోపాధ్యాయ్ (మిరపకాయ్), దీక్షా సేథ్ (మిరపకాయ్) వంటి కథానాయికలకి రవితేజ సరసన నటించిన సినిమాలతోనే నాయికలుగా తెలుగునాట తొలి విజయాలు దక్కాయి. మరి.. వారి బాటలోనే మీనాక్షి, డింపుల్ కూడా వెళతారేమో చూడాలి.