English | Telugu

ఏం చేద్దామంటావ్ మరి.. కేసీఆర్ వివాదంపై మణిశర్మ రియాక్షన్!

'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart)లోని 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) డైలాగ్ 'ఏం చేద్దామంటావ్ మరి' ఉపయోగించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ వివాదంపై 'డబుల్ ఇస్మార్ట్' సంగీత దర్శకుడు మణిశర్మ స్పందించారు.

మాజీ సీఎం కేసీఆర్ గారు అంటే తమకి అభిమానమని మణిశర్మ అన్నారు. అది ఐటెం సాంగ్ కాదని, హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్ అని చెప్పారు. సీరియస్ మేటర్ ని కూడా కేసీఆర్ గారు సరదాగా చెప్తారు. వినోదం కోసమే ఆయన మాటను ఈ పాటలో పెట్టాం. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో నేనెప్పుడూ ఎవరిని కించపరచలేదు. కేసీఆర్ గారి మీద అభిమానంతోనే ఈ పాటలో ఆయనను తలచుకున్నామని మణిశర్మ చెప్పుకొచ్చారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.