English | Telugu

మ‌నోజ్ పెళ్లి మే 20న‌

క‌రెంటు తీగ లాంటి కుర్రాడు... మంచు మ‌నోజ్ ఓ ఇంటివాడ‌వుతున్నాడు. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అయిన మనోజ్ నిశ్చితార్థం ఈరోజు (బుధ‌వారం) ప్ర‌ణ‌తితో హైద‌రాబాద్ లోని పార్క్ హ‌య‌త్ హోటల్ అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రుగుతోంది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌నోజ్ - ప్ర‌ణ‌తి జంట‌ను ఆశీర్వ‌దించారు. ఈరోజే మ‌నోజ్‌ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. మే 20న మ‌నోజ్ - ప్ర‌ణ‌తిల పెళ్లి జ‌రిపించాల‌ని ఇరు కుటుంబాల వాళ్లు నిర్ణ‌యించుకొన్నారు. మే 20 తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ముహూర్తం నిర్ణ‌యించారు. మ‌నోజ్‌కి ఆల్ ది బెస్ట్‌..