English | Telugu

మహేష్,రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా రామ్ చరణ్ ముద్దుగుమ్మ!

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)రాజమౌళి(rajamouli)కాంబోలో తెరకెక్కబోతున్నమూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ అనే విషయం తెలిసిందే.ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాదే(vijayendra prasad)స్వయంగా చెప్పడం జరిగింది.2025 ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందనే వార్తలైతే గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.రాజమౌళి అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు లొకేషన్ల వేటలో ఉన్నాడు.

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజిబెత్ ఇస్లాన్' చేస్తుందనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో బాలీవుడ్ అగ్రనటి ప్రియాంక చోప్రా(priyanka chopra)చెయ్యబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.మూవీలో హీరోతో పాటు హీరోయిన్ క్యారక్టర్ కి చాలా ప్రాధాన్యత ఉందంట.దీంతో ప్రియాంక లాంటి సీనియర్ నటీమణి అయితే ఆ క్యారక్టర్ కి న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించి,ఆమెని సంప్రదిస్తే ప్రియాంక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.తన క్యారక్టర్ కి సంబంధించిన ప్రిపరేషన్ ని కూడా ఆమె మొదలుపెట్టిందనే మాటలు కూడా వినపడుతున్నాయి.పలు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా చేసిన ప్రియాంక మహేష్ మూవీకి ప్లస్ అని కూడా భావించవచ్చు.ప్రియాంక మన తెలుగు హీరోల్లో రామ్ చరణ్(ram charan)తో కలిసి జంజీర్ రీమేక్ తుఫాన్ లో చేసిన విషయం తెలిసిందే.

ఇక రాజమౌళి తన ఎంటైర్ కెరిరీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహేష్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. భారతీయ సినీ ప్రపంచంలో ఇంతవరకు తెరకెక్కని ఒక కొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తున్నాడు. పలు విదేశీ నటులు కూడా నటించబోతున్న ఈ పాన్ వరల్డ్ మూవీకి దుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ(kl narayana)నిర్మాత కాగా కీరవాణి(keeravani)మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.