English | Telugu

ఆ రెండు ఫ్లాపులూ మ‌హేష్‌ని మార్చేశాయి

టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకొంటున్న క‌థానాయ‌కుడు ఎవ‌రు?? అని అడిగిగే చ‌టుక్కున మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పేర్లు చెప్పేస్తాం. అత్తారింటికి దారేది కంటే ముందు... ప‌వ‌న్ కంటే మ‌హేష్ బాబే ఓ మెట్టు పైనున్నాడు. దూకుడు సినిమాతో.. త‌న స్టామినా చూపించిన మ‌హేష్‌.. పారితోషికంలో ఎవ్వ‌రికీ అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆ త‌ర‌వాత మ‌హేష్‌ని ప‌వ‌న్ బీట‌వుట్ చేశాడు. అయితే ఇప్పుడు మ‌హేష్‌లో మార్పు క‌నిపిస్తోంది. సినిమా బ‌డ్జెట్ పెరిగిపోవ‌డానికి త‌న పారితోషికం కార‌ణం కాకూడ‌ద‌న్న విశాల దృక్ప‌థంతో త‌న పారితోషికాన్ని త‌గ్గించుకొన్నాడ‌ట‌. పైగా నేనొక్క‌డినే, ఆగ‌డు సినిమాలు భారీ ఫ్లాపులు మూట‌గ‌ట్టుకొన్నాయి. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల‌కు న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాల‌న్న ఉద్దేశంతో త‌న పారితోషికంలో కొంత భాగం వెన‌క్కి ఇచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ''మ‌న‌కు మంచి నిమాలొస్తున్నాయి. కాక‌పోతే బ‌డ్జెట్ మించిపోతోంది. మ‌న కంట్రోల్‌లో ఉండడం లేదు. మ‌హేష్ సినిమాల‌కు రూ.70 కోట్ల వ‌ర‌కూ అవుతోంది. అందుకే.. మ‌హేష్ త‌న పారితోషికాన్ని త‌గ్గించుకోన్నాడు'' అంటూ కృష్ణ చెబుతున్నారు. నిర్మాత‌ల‌కు ఇంత‌కంటే స్వీట్ న్యూస్ ఏముంటుంది?