English | Telugu
మహేష్ అదరగొట్టాడు..!
Updated : Aug 26, 2014
మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలో డైలాగులు ఏ రేంజ్ లో వున్నాయో... ఆ మూవీలో ఓ పాటకు మహేష్ వేసిన స్టెప్పులు అదే రెంజులో వున్నాయని అంటున్నారు. 'ఆగడు' లో ‘ఆజా.. సరోజ’ అనే ఐటెం సాంగ్ కి అదరగొట్టే రేంజ్‌లో స్టెప్స్ వేశాడని ఇన్‌సైడ్ టాక్. గతంలో డాన్స్ లపై అంతగా శ్రద్ద చూపని మహేష్ బాబు '1నేనొక్కడినే' సినిమాలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అదే ఎంటర్ టైన్మెంట్ ఇవ్వలని ‘ఆగడు’ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తో కలిసి బాగా కష్టపడుతున్నాడట. అయితే ఈ సరోజ సాంగ్‌లో హీరోయిన్ తమన్నా ఉందా లేక ఐటంసాంగ్ చేస్తున్న స్లిమ్ బ్యూటీ శృతిహసన్ చేస్తుందా అని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారట.