English | Telugu

100 కోట్లు అవుట్.. 200 కోట్ల దిశగా మహావతార్ నరసింహ!

స్టార్స్ లేకపోయినా, కంటెంట్ తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించవచ్చని నిరూపించిన తాజా చిత్రం 'మహావతార్ నరసింహ'. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. (Mahavatar Narsimha)

'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న హోంబలే ఫిలిమ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించింది. అందులో భాగంగా మొదటి చిత్రంగా 'మహావతార్ నరసింహ' వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.

'మహావతార్ నరసింహ' సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హిందీ, తెలుగు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో రోజురోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం రూ.105 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ప్రస్తుత జోరు చూస్తుంటే త్వరలోనే రూ.150 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డివోషనల్ ఫిల్మ్ కావడం, యానిమేషన్ వర్క్ బాగుందని టాక్ రావడం, పిల్లలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం.. వంటి కారణాలతో 'మహావతార్ నరసింహ'కు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వీక్ డేస్, వీకెండ్ అనే తేడా లేకుండా టికెట్లు బుక్ అవుతున్నాయి. ఈరోజు సోమవారం అయినప్పటికీ.. బుక్ మై షోలో గంటకు 13 వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయంటే.. ఆడియన్స్ ఏ స్థాయిలో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.