English | Telugu

రెడీ ఫర్ రిలీజ్ లండన్ లైఫ్


అసద్ షాన్, యాంబర్ రోజ్ ప్రధాన పాత్రల్లో నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందించిన సినిమా \'లండన్ లైఫ్\'. లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా.. దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ.. \'\'హాలీవుడ్ లో సుమారుగా ముప్పై సినిమాలకు పని చేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. ఇండియా నుండి లండన్ వెళ్ళిన తొమ్మిది మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో వాళ్ళకు ఎదురైన సంఘటనలను సినిమాగా రూపొందించాం. పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో రిలీజ్ చేస్తున్నాం. లండన్, అమెరికాలలో కె.వి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఐ.టి ఉద్యోగులు, ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేశాం. సిద్ధార్థ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి రొమాంటిక్ కామెడీ ఫిలిం ఇది\'\' అని చెప్పారు.

కాళి సుదీర్ మాట్లాడుతూ.. \'\'టాలెంట్ ఉండి మంచి దారి తెలియక చాలా మంది ఉన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అంగీకరించాం. నవీన్ మేకింగ్ చాలా బావుంది. సినిమాలో మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ ఉంది\'\' అని చెప్పారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.