English | Telugu
వెనక్కి తగ్గిన కుబేర.. కారణం అదేనా..?
Updated : Feb 27, 2025
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. 'కుబేర' సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో మార్చి లేదా ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశముందని భావించారంతా. కానీ ఈ మూవీ ఏకంగా జూన్ కి పోస్ట్ పోన్ అయింది. (Kubera On June 20th)
'కుబేర' చిత్రాన్ని జూన్ 20న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన సినిమాని, ఏకంగా జూన్ కి వాయిదా వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే దీని వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. కుబేరను ఏప్రిల్ లో విడుదల చేయాలని మొదట భావించారట. కానీ ఏప్రిల్ లో ధనుష్ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ.. నటిస్తున్న 'ఇడ్లీ కడై' విడుదల కానుంది. అందుకే రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలనే ఉద్దేశంతో.. కుబేరను జూన్ కి వాయిదా వేసినట్లు సమాచారం.