English | Telugu

కిరణ్ అబ్బవరం 'క' మూవీకి దిమ్మతిరిగే బిజినెస్!

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అప్ కమింగ్ మూవీ 'క' (KA). శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పీరియాడిక్ ఫిల్మ్. ఇటీవల విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్‌ లో క్రేజ్‌ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే బిజినెస్ భారీగా జరుగుతోంది.

'క' మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను వంశీ నందిపాటి రూ.12 కోట్లకు తీసుకున్నారట. ఇతర భాషల థియేట్రికల్ రైట్స్, నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపి మరో రూ.18 కోట్లు పలుకుతున్నాయట. అంటే ఈ మూవీ ఓవరాల్ గా రూ.30 కోట్ల బిజినెస్ చేయనుంది. కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరో సినిమాకి రూ.30 కోట్ల బిజినెస్ జరగడం అనేది నిజంగా విశేషమే.

కెరీర్ స్టార్టింగ్ లో 'రాజావారు రాణిగారు', 'SR కళ్యాణమండపం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తరువాత వరుస పరాజయాలతో నిరాశపరిచాడు. సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న 'క' టీజర్ ప్రామిసింగ్ గా కనిపించింది. దీంతో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఫామ్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.