English | Telugu

బాబు కాళ్లకి ముద్దుపెట్టిన కిరణ్ అబ్బవరం..అభిమానులు ఖుషి 

ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)గత ఏడాది ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'క'(Ka)మూవీతో తన కెరిరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం 'కె ర్యాంప్'(K ramp)అనే మరో విభిన్నమైన జోనర్ కి సంబంధించిన సినిమా చేస్తుండగా,ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టు 22 న తన తొలి చిత్రంలో హీరోయిన్ గా చేసిన 'రహస్య గోరఖ్'(Rahasya Gorak)ని వివాహం చేసుకున్నాడు. రీసెంట్ గా రహస్య పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం సామాజిక మాద్యమాల ద్వారా తెలియచేశాడు. బాబు కాళ్ళకి ముద్దుపెడుతు కిరణ్ అబ్బవరం షేర్ చేసిన పిక్ ఇప్పుడు తన అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజావారు, రాణి వారు అనే చిత్రంతో కిరణ్ అబ్బవరం సినీ అరంగ్రేటం చేసాడు. ఎస్ ఆర్ కల్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్, దిల్ రుబా వంటి పలు చిత్రాలు కిరణ్ నుంచి వచ్చాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.