English | Telugu
ఇద్దరి పెదవుల్నీ పిండేసిన కమల్
Updated : Sep 22, 2015
కమల్‌హాసన్ సినిమా అంటే... సమ్‌థింగ్ స్పెషల్ ఉండాల్సిందే. కథ,కథనాల్లో తనదైన ముద్ర చూపిస్తుంటారాయన. అయితే.. తన సినిమాలో శృంగారం మిక్స్ చేయడంలో కమల్.. రూటే సెపరేటు. కమల్ సినిమాల్నీ ఓసారి పరిశీలించండి. ఏదోలా రొమాన్స్ మిక్స్ చేస్తుంటాడు. లిప్‌లాక్‌లకైతే లెక్కేలేదు.
తాజాగా... చీకటి రాజ్యంలోనూ తన విశ్వరూపం చూపించేశాడని టాక్. ఇదో యాక్షన్ థ్రిల్లర్. అస్తమానూ... ఫైట్లూ, ఛేజింగులే చూపిస్తే అంత కిక్ ఉండదని కమల్ ఫీలై ఉంటాడు. అందుకే ఈ సినిమాలో లిప్‌లాక్‌లకు చోటిచ్చాడట. ఇందులో ఇద్దరు హీరోయిన్లున్నారు. త్రిష ఓ కథానాయికగా కనిపిస్తే.. మధుశాలిని మరో కథానాయిక. వీరిద్దరి పెదవుల్నీ ఓ సన్నివేశంలో ఎడాపెడా పిండేశాడట కమల్.
చీకటి రాజ్యం సినిమాలో ఈ లిప్‌లాక్ సన్నివేశాలు కూడా హైలెట్‌గా నిలుస్తాయని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. త్రిష చాలాకాలం తరవాత లిప్ లాక్ సన్నివేశంలో కనిపించిందని, కమల్ అనేసరికి మధుశాలికి లిప్‌లాక్ సీన్‌లో జీవించేసిందని తమిళ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. మరి వెండి తెరపై ఆ సన్నివేశాలు ఎలా పండాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.