English | Telugu

K Ramp Teaser: కామెడీ అంటే బూతు డైలాగులేనా..?

కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న చిత్రం 'కె-ర్యాంప్'. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఎంటర్టైనింగ్ గా బాగానే ఉన్నప్పటికీ.. కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. (K Ramp Teaser)

లిప్ కిస్ లు, బూతు డైలాగులు ఉంటే యూత్ ఎట్రాక్ట్ అయిపోయి.. థియేటర్లకు వచ్చేస్తారనే భ్రమల్లో కొందరు మేకర్స్ ఉంటారు. అదే కోవలో 'కె-ర్యాంప్' టీజర్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీజర్ లో హీరో ఎంట్రీనే బూతు డైలాగుతో ఉంది. ఇది కాకుండా మరో రెండు మూడు డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. నిజానికి టీజర్ సరదాగా బాగానే ఉంది.. కానీ, ఈ బోల్డ్ డైలాగుల వల్ల.. కొందరి నుంచి నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవల రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న సినిమా ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. అది కూడా రొమాంటిక్ కామెడీ సినిమానే. అలా అని ఘాటు రొమాన్స్, బోల్డ్ డైలాగ్స్ జోలికి వాళ్ళు పోలేదు. యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేలా సినిమాని మలిచారు. కాబట్టి లిప్ కిస్ లు, బోల్డ్ డైలాగ్స్ ఉంటే యూత్ ఎట్రాక్ట్ అవుతారు అనుకోకుండా.. 'లిటిల్ హార్ట్స్' తరహాలో కంటెంట్ మీద ఫోకస్ చేసి, హెల్తీ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేయాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.