English | Telugu

శంషాబాద్ లో ఎన్టీఆర్, జాన్వీ రచ్చ రచ్చ..!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఏకంగా 8 ఏళ్ళ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి వినిపిస్తోంది.

అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న 'దేవర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఫియర్ సాంగ్' కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అనిరుధ్ అంతకుమించి అనేలా అదిరిపోయే సాంగ్స్ ని స్వరపరిచాడట. ముఖ్యంగా ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కలిసి చిందేసే మాస్ డ్యూయెట్ ఓ రేంజ్ లో ఉంటుందట. ఈ సాంగ్ కి థియేటర్లలో మాస్ ఆడియన్స్ ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ని చిత్రీకరించనున్నారు. శంషాబాద్ లో వేసిన భారీ సెట్ లో జులై 10 నుంచి షూట్ జరగనుందని తెలుస్తోంది. ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఈ సాంగ్ కోసం ఆయన అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట. ఎన్టీఆర్ ఎంత గొప్ప డ్యాన్సరో తెలిసిందే. కష్టమైనా స్టెప్ ని కూడా సింగిల్ టేక్ లో చేస్తాడనే పేరుంది. మరి అలాంటి ఎన్టీఆర్ స్పీడ్ ని జాన్వీ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

కాగా, ఇటీవల గోవాలో ఎన్టీఆర్-జాన్వీ లపై ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఆ సాంగ్ ని సెకండ్ సింగిల్ గా ఈ నెలలోనే విడుదల చేసే అవకాశముంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.