English | Telugu

కార్తీ జపాన్ ఓటిటి అందులోనే  

హీరో కార్తీకి తెలుగు తమిళంలో సమానమైన క్రేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకే సారి రిలీజ్ అవుతుంది .ఇప్పుడు లేటెస్ట్ గా జపాన్ అనే మూవీతో కార్తీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పడు ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది.

జపాన్ సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కార్తీ సరసన అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సునీల్, ప్రముఖ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణం లో వచ్చిన ఈ సినిమాకి రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు.
దీపావళి కానుకగా ఈ రోజు థియేటర్ల లోకి వచ్చిన జపాన్ మూవీ విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. సినిమా చూసిన ప్రేక్షకులందరు కూడా కార్తీ నటన అయితే చాలా బాగుందనే మాట చెప్తున్నారు

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.