English | Telugu

న‌గ్న‌త్వం త‌ప్పు కాద‌న్న రాధికా ఆప్టే

న‌గ్న‌త్వం త‌ప్పు కాద‌న్న రాధికా ఆప్టే


ఈమ‌ధ్య నెట్ ప్ర‌పంచంలో రాధికా ఆప్టే న్యూడ్ వీడియో ఓ ప్ర‌భంజ‌నాన్నిసృష్టించింది. రాధిక మ‌రీ అంత న‌గ్నంగా క‌నిపించ‌డం ఏమిటి? అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అస‌లు ఈ సీన్లు కావాల‌ని లీక్ చేశారా, లేదా అనుకోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయా అనే అనుమానాలు నెల‌కొన్నాయి. ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అని కొట్టి ప‌డేసిన వాళ్లున్నారు. ఈ న్యూస్ సీన్ గురించి చిత్ర‌బృందం అంతా మాట్లాడేసింది. ఒక్క రాధికా ఆప్టే త‌ప్ప‌. ఇప్పుడు త‌ను కూడా నోరు విప్పింది. న్యూడ్‌గా క‌నిపించ‌డం పెద్ద త‌ప్పు కాదు అన్న‌ట్టు మాట్లాడుతోంది రాధిక‌. క‌థ‌కు అవ‌స‌రమైన‌ప్పుడు ఎలా క‌నిపించినా త‌ప్పులేద‌ని షాక్ స్టేట్‌మెంట్ ఒక‌టిచ్చింది. అయితే.. అర‌కొర దుస్తుల‌తో ఐటెమ్ సాంగ్స్ చేసే హాట్ భామ‌ల‌కంటే తాను కొంచెం బెట‌ర్ అంటోంది రాధిక‌. మ‌రి అదేం లెక్కో అర్థం కావ‌డం లేదు.

 

ఐటెమ్ సాంగుల వ‌ల్ల మ‌సాలా యాడ్ అవుతుంది త‌ప్ప‌.. సినిమాకి పెద్ద ఉప‌యోగం ఉండ‌ద‌ని, వాటిని చూసే జ‌నం చెడిపోతున్నార‌న్న‌ది రాధిక ఇన్న‌ర్ మీనింగ్ కావొచ్చు. అయితే.. న్యూడ్ సీన్లు బ‌య‌ట‌కు రావ‌డం వ‌ల్ల‌.. అది చూసి యువ‌త పాడైపోవ‌డం లేదా??  దీనికి రాధిక ఎలాంటి స‌మాధానం చెబుతుంది?  ఇలా సినిమా కంటే ముందు అందులోని హాట్ స‌న్నివేశాల్ని కావాల‌ని లీక్ చేయ‌డం ప‌బ్లిసిటీ స్టంట్ కాదా??  డ‌బ్బులు చేసుకొనే వ్యాపార దృక్ప‌థానికి ఇంత‌కంటే చీప్ ట్రిక్స్ ఉండ‌వు క‌దా??  రాధిక మాట‌లు వింటుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. అయితే నేం.. రాధిక ప్లాన్ పారింది. ఇప్పుడు దేశ‌మంతా ప‌ర్చేద్ సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఈ సినిమాని విడుద‌ల చేస్తే డ‌బ్బులే డ‌బ్బులు.