English | Telugu

ఒకే ఏడాదిలో 3190 కోట్లు సంపాదించిన బాలీవుడ్ అగ్ర నటి  

మూడున్నర దశాబ్డల క్రితమే పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటిన భామ 'జుహీచావ్లా'(Juhi Chawla).కింగ్ 'నాగార్జున'(Nagarjuna)తో చేసిన విక్కీదాదా,శాంతి క్రాంతి చిత్రాలతో అయితే తెలుగు ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఆమె హిందీలో చేసిన చాలా చిత్రాలని జుహీచావ్లా కోసమే తెలుగు ప్రేక్షకులు చూశారంటే, జుహీ సృషించిన ప్రభంజాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ప్రతి ఏడాది భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాని ప్రచురించే 'హురున్ ఇండియా రిచ్'(Hurun India Rich)నటులకి సంబంధించిన జాబితాని కూడా విడుదల చేస్తుంది. ఈ కోవలోనే రీసెంట్ గా కొత్త జాబితాని చేయగా, జుహీచావ్లా' 7,790 కోట్ల రూపాయల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచింది. ఎక్కువ ఆస్తులు ఉన్న మొదటి భారతీయ నటి కూడా జుహీచావ్లానే. 2024లో ఆమె ఆస్తుల విలువ 4,600 కోట్లు, అలాంటింది ఒకే సంవత్సరంలో 3,190 కోట్ల రూపాయిలు పెరిగి 7790 కోట్లకి చేరుకున్నాయి. షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)12,490 కోట్లతో మొదటి స్థానంలో, హృతిక్ రోషన్ .2,160 కోట్లుతో థర్డ్ ప్లేస్, ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ 1880 కోట్లుతో నాల్గవ స్థానం, అమితాబ్ బచ్చన్ 1630 కోట్లుతో ఐదవ స్థానంలో ఉన్నారు. జుహీచావ్లా నటిగా ప్రాధాన్య గల పాత్రలని పోషిస్తునే, మరో వైపు వ్యాపార రంగంలోను దూసుకుపోతుంది. 1995 లో 'జయ మెహతా' అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్న జూహ్లీ, తన భర్త ప్రోద్బలంతో మెహతా గ్రూప్ ఆధ్వర్యంలోని వ్యాపార లావాదేవీలన్నీ చూసుకుంటుంది.

క్రికెట్ లీగ్ పోటీలకి సంబంధించి ఐపీఎల్ తరుపున కోల్ కతా జట్టుకి షారుక్ తో కలిసి యజమాని గా కూడా ఉంది. సినీ కెరీర్ పరంగా చూసుకుంటే 2023 లో హిందీలో విడుదలైన 'ఫ్రైడే నైట్ ప్లాన్' లో మదర్ క్యారక్టర్ లో అలరించగా, ఇప్పటి వరకు సుమారు తొంబై చిత్రాల వరకు చేసింది. నిర్మాతగాను షారుక్ తో కలిసి మూడు చిత్రాలని నిర్మించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.