English | Telugu
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్!
Updated : Apr 19, 2023
టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళు, ఆఫీస్ లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నివాసంతో పాటు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించిన సినిమాలంటే ముందుగా 'పుష్ప: ది రైజ్', 'ఆర్ఆర్ఆర్' గుర్తుకొస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో 'పుష్ప-2' రూపొందుతోంది. అలాగే ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నారు సుకుమార్. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా రూ.1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాల దర్శకనిర్మాతలపై ఐటీ సోదాలు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.