English | Telugu
'ఏజెంట్' ట్రైలర్.. ప్రతి నిమిషం గూస్ బంప్సే కదా జీ!
Updated : Apr 19, 2023
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మమ్ముట్టి, డినో మోరియా ముఖ్య పాత్రలు పోషించారు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ ఫిల్మ్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ఏజెంట్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు సురేందర్ రెడ్డికి స్టైలిష్ మేకర్ గా పేరుంది. ఏజెంట్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాని మరింత స్టైలిష్ గా రూపొందించారని అర్థమవుతోంది. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే అసలుసిసలు పాన్ ఇండియా కళ కనిపిస్తోంది. ఇక అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతని మేకోవర్, బాడీ ల్యాంగ్వేజ్ ఆకట్టుకుంటున్నాయి. అఖిల్, మమ్ముట్టి మధ్య సన్నివేశాలు అలరిస్తున్నాయి. "సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే", "చేతిలో గన్ను, యాక్షను, ఎమోషన్.. ప్రతి నిమిషం గూస్ బంప్సే కదా జీ" వంటి డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే సినిమా యాక్షన్ థ్రిల్లర్ అభిమానులను మెప్పించేలా ఉంది. మరి ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ సక్సెస్ ని అందుకుంటాడేమో చూడాలి.