English | Telugu

చూడండి బాబూ చూడండి!

కుర్రాళ్లు చూడకపోతే నామీద నాకే డౌటొస్తుంది. రామ రామ ఎవరీ భామ అంటారా? మీరు అస్సలు ఊహించని విద్యాబాలన్. ఉల్లాల్లా ఉల్లాలా అని చెలరేగిపోయిన విద్యా డర్టీ హీరోయిన్ గా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. వెంటవెంటనే మంచి మంచి ఆఫర్లు, అవార్డులు ఆ వెంటనే పెళ్లి ఒకటేమిటి వార్తలకు దూరంగా ఒక్కరోజైనా లేదు. ఆ మధ్య మీరు తల్లికాబోతున్నారటగా అంటే...ఏదీ మా ఆయన బెడ్ రూమ్ లోకే రానిదే అని మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది. లేటెస్ట్ గా అబ్బాయిలు గమనించపోతే తట్టుకోలేనబ్బా అని మరోసారి అటెన్షన్ క్రియేట్ చేసుకుంది. నేనేనా ఏ అమ్మాయికైనా సేమ్ ఫీలింగ్ ఉంటుందని కుండబద్దలకొట్టింది. అయితే అమ్మడు క్లారిటీ మిస్సవలేదండోయ్..... లుక్స్ వరకూ ఓకే కానీ అంతకు మించి అడుగు ముందుగేస్తే సహించేదిలేదంటోంది. దీంతో పురుష పుంగవులంతా అందీ అందని అందమె ముద్దు అని పాటందుకుంటున్నారట.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.