English | Telugu

'రుద్రమదేవి' పై శివదేవయ్య ఏమ్మన్నారంటే..

అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందించిన భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. అక్టోబర్ 9న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నేను చాలా కథలు విని ఉంటాను. కాని గుణ కథ చెప్పినప్పుడు ఆయనలో ప్రతి వ్యక్తి కోరుకునే ఓ దర్శకుడు కనిపించాడు. ఆయన ఇండస్ట్రీలో పెద్ద దర్శకుడైనా తెలుగు సంప్రదాయాన్ని, చరిత్రను మర్చిపోకుండా తనకు తెలిసిన సినిమా పరిభాషలో చెప్పాలనుకున్నాడు. కథ విన్న తరువాత నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి కాని, ఎన్ని రోజులు నా పాత్ర షూట్ చేస్తారని కాని ఆలోచించలేదు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం ఇలా అన్ని ప్రాంతాల్లో రుద్రమదేవి గురించి బాగా మాట్లాడడం వింటుంటే ఈ సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా అనిపించింది. ఎందరో హీరోయిన్స్ ను, కళాకారులను చూసాను కాని డబ్బు మాత్రమే కెరీర్ అనుకోకుండా ఇలాంటి ఓ మంచి చిత్రంలో నటించాలని అనుష్క తీసుకున్న శ్రమను ఎవరి దగ్గర చూడలేదు. గోనగన్నారెడ్డి పాత్రను ఎంతో ప్రేమతో, భాద్యత తో అల్లు అర్జున్ చేసాడు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒకరోజు అరవింద్ గారు ఫోన్ చేసి బన్నీ, గోనగన్నారెడ్డి పాత్రలో నటించడానికి సైన్ చేస్తున్నాడు. నీకు ఈ విషయం చెప్పి సైన్ చేయాలని ఫోన్ చేసానని ఆయన చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. బన్నీ తన మొదటి చిత్రం నుండి నాతో ఫాలో అవుతున్నాడు. నన్ను గురువుగారు అని పిలుస్తాడు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలందరిలో తానంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి సినిమాకు ఏదోకటి నేర్చుకుంటూ.. మెచ్యూడ్ యాక్టర్ లా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. గోనగన్నారెడ్డి పాత్రలో బన్నీ చేయగలడా.. అని చాలా మందికి అనుమానం ఉండేది. కాని ఈ సినిమాలో తనను చూసాకా ఇంకో గోనగన్నారెడ్డి లేడేమో అనిపిస్తుంది. ఈ సినిమా ప్రపంచమంతా ఓ సారి తిరిగి చూసేలా చేసింది. దాసరి లాంటి వ్యక్తి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిమరీ ఈ చిత్రాన్ని అప్రిషియేట్ చేసారు. రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు నిర్విరామంగా తన ట్విట్టర్ లో ఈ సినిమా గురించి చెబుతూనే ఉన్నాడు. దీన్ని బట్టి తెలుగువారి సంస్కారం ఏంటో తెలుస్తుంది. ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని చెప్పారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.