English | Telugu

గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ 

సినిమా పేరు: గాంధీ తాత చెట్టు
నటీనటులు:సుకృతి వేణి,ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్, భాను ప్రకాశ్ తదితరులు
రచన,దర్శకత్వం: పద్మావతి మల్లాది
సినిమాటోగ్రఫి: శ్రీజిత చెరువుపల్లి, విశ్వ దేవబత్తుల
ఎడిటర్: హరిశంకర్
సంగీతం: రీ
నిర్మాతలు:నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు
సమర్పణ: తబితా సుకుమార్‌
బ్యానర్స్: సుకుమార్ రైటింగ్స్,మైత్రి మూవీ మేకర్స్,గోపీ టాకీస్
రిలీజ్ డేట్:24 -01 - 2025

ప్రముఖ అగ్ర దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గాంధీ తాత చెట్టు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సుకృతి వేణి ఇప్పటికే 14 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ లో భాగంగా ఛైల్డ్స్ విభాగంలో విన్నర్ గా నిలవడం,పుష్ప 2 ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ప్రేక్షకుల్లో కూడా మూవీ పట్ల ఒకింత ఆసక్తి ఏర్పడింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
తెలంగాణలోని ఒక విలేజ్ లో గాంధీ( సుకృతి వేణి )ఎనిమిదవ క్లాస్ చదువుతు ఉంటుంది.నిజం మాత్రమే మాట్లాడుతు,తన చుట్టూ పక్కల వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది.ఎవరైనా తనని బాధపెట్టినా కూడా తిరిగి వాళ్లని ఏమి అనదు.స్వాతంత్య్రాన్ని తెచ్చిన గాంధీ ఆశయాలని ఓనికి పుచ్చుకొని ఉంటుంది.తన ఊరు అంటే గాంధీకి చాలా ఇష్టం.తాత రామచంద్రయ్య(ఆనంద చక్రపాణి) అన్నా కూడా చాలా ప్రేమ.ఒకరికొకరు ఎంతో ఆప్యాయతగా ఉంటారు.ఒక ప్రవైట్ కంపెనీకి చెందిన సతీష్(రాగ్ మయూర్) అనే వ్యక్తి నిర్వాహకం వల్ల రామ చంద్రయ్య చనిపోతు గాంధీ దగ్గర ఒక మాట తీసుకుంటాడు.తాతకి ఇచ్చిన మాట కోసం గాంధీ తన తండ్రి దివాకర్(రఘురాం) ని కూడా ఎదురిస్తుంది.అదే టైంలో చిన్న పిల్లని కూడా చూడకుండా గాంధీకి పెళ్లి చెయ్యాలని దివాకర్ నిర్ణయించుకుంటాడు.గాంధీని రామచంద్రయ్య కోరిన కోరిక ఏంటి? రామచంద్రయ్య చనిపోవడానికి కారణం ఎవరు? ప్రవైట్ కంపెనీ వాళ్లు గాంధీ వాళ్ల ఊరు ఎందుకు వచ్చారు? టైటిల్ లో చెప్పినట్టు చెట్టు వెనక ఉన్న కథ ఏంటి? గాంధీ లక్ష్యం ఏంటి? అసలు ఈ కథ కి మహాత్మ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ చిత్ర కథ

ఎనాలసిస్:
ముందుగా ఇలాంటి మెసేజ్ తో కూడిన సినిమాని నేటి తరం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకురాలు పద్మావతి మల్లాది అభినందనీయురాలని చెప్పుకోవాలి.విలేజ్ కి చెందిన ఒక రైతుకి తన భూమి మీద ప్రేమ ఎంత ఉంటుందో,గాంధేయ వాదాన్ని చిన్నపట్నుంచి ఒంట పట్టించుకున్న ఒక వ్యక్తి సంరక్షణలో ఒక ఆడపిల్ల పెరిగితే,పెద్దయ్యాక ఆ ఆడపిల్ల ఎంత నిజాయితీగా,ఎంత నిబద్దతో ఉంటుందో ఈ సినిమా చెప్పింది. విలేజెస్ లో కల్లాకపటంలేని మనుషులు,వాళ్ల మనసులు కూడా అంతే కల్లా కపటం లేని విధంగా ఎలా ఉంటాయో కూడా ఈ చిత్రం చూపించింది.ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సుకృతి వేణి,ఆనంద చక్రపాణి ల ఇంట్రడక్షన్ తోనే ప్రేక్షకుడు సినిమాలో లీనమయిపోతాడు.అంత హృద్యంగా సీన్స్ ఎలివేషన్ అయ్యాయి.కాకపోతే ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా సినిమాల్లో రెగ్యులర్ గా వచ్చినవే.కాకపోతే డైలాగ్స్,సుకృతి పెర్ఫార్మెన్సు వాటన్నిటిని మర్చిపోసేలా చేసింది.అదే విధంగా రొటీన్ గా సాగుతున్న టైంలో 'చెట్టు' కి ఉన్న గొప్పతనాన్ని,దాని వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ప్రతి మనిషి హృదయాల్ని హత్తుకునేలా చేస్తుంది.పైగా 'చెట్టు' కి లెజండరీ నటుడు తనికెళ్ళ భరణి వాయిస్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిల్చింది.సుకృతి ఫాదర్ రఘురాం తీసుకున్న నిర్ణయం నేడు పల్లెలో ఉన్న చాలా మంది ఆలోచలని మనకి గుర్తు చేస్తుంది.కాకపోతే ఈ క్యారక్టర్ ని సినిమాలో మరింతగా వాడుకోవాల్సింది.అందుకు తగ్గ అవకాశం కూడా ఉంది.రైతులు తమ భూముల్ని అమ్ముకునే ప్రాసెస్ ని కూడా ఇంకొంచం ఎక్కువగా చూపించి,భూముల్ని అమ్ముకోవద్దని సుకృతి చేత చెప్పించాల్సి ఉండేది.ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా పండలేదు.ఎందుకంటే ఆ ట్విస్ట్ ని అందరు ముందుగానే ఊహిస్తారు
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ చాలా వేగంగా సాగింది.ముఖ్యంగా సుకృతి తన ఊరిని కాపాడుకోవడానికి పడే తాపత్రయంప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది.అందులో భాగంగా తన ఊరి పంట చెరుకు నుంచి బెల్లం తయారు చేసే కాన్సెప్ట్ అయితే సూపర్ గా ఉంది.దీంతో క్లైమాక్స్ ని చాలా మంది ఊహించేస్తారు.కానీ అందుకు భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుడు మంచి ఫీల్ తో థియేటర్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉంది.పైగా టైటిల్ కి తగ్గట్టుగా కూడా ఆ లీడ్ మొత్తం ఉండటంతో ప్రేక్షకుడు సాటిస్ఫైడ్ అయ్యే అవకాశం ఉంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు

ఇక గాంధీ క్యారక్టర్ తో పాటు .తెలంగాణ అమ్మాయిగా సుకృతి వేణి చాలా అధ్బుతంగా నటించింది.అన్ని ఎమోషన్స్ లో కూడా సూపర్ గా నటించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది.ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే తన నటన అమోఘం.తెలుగు సినిమా పరిశ్రమకి ఇంకో మంది ఆర్టిస్ట్ సుకృతి రూపంలో దొరికినట్టే.తాత గా చేసిన ఆనంద చక్రపాణి అయితే రామ చంద్రయ్య క్యారక్టర్ లో జీవించేసాడు.గాంధేయ వాదిగా,మనవరాలు మీద ప్రేమ చూపించే తాతగా,చెట్టుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తిగా తన నటన ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉందని చెప్పవచ్చు.గాంధీకి తండ్రిగా చేసిన రఘురాం,తల్లి క్యారక్టర్ లో చేసిన నటి కూడా తమ క్యారక్టర్ లో సూపర్ గా నటించారు.సుకృతి ఫ్రెండ్స్ గా చేసిన వాళ్లు కూడా ఉత్తమ నటనని కనపర్చారు.డైరెక్షన్ కూడా బాగుంది.రెండు బలమైన పాయింట్స్ ని దర్శకురాలు డీల్ చేసిన విధానం సూపర్.కాకపోతే బలమైన సీన్స్,బలమైన భావోద్వేగం ఉండేలా పకడ్భంది సీన్స్ ఉండాల్సింది.ఫోటోగ్రఫీ బాగున్నా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఒక మాదిరిగా ఉన్నాయ్.ఆర్ ఆర్ బాగుంది.


ఫైనల్ గా చెప్పాలంటే మెసేజెస్ ఓరియెంటెడ్ తో పాటు ఫీల్ గుడ్ మూవీ చూసే వాళ్ళకి నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రేటింగ్ 2 .75 /5 అరుణాచలం

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.