English | Telugu

గాలిపటం కాపాడింది..!

లవ్ లీ స్టార్ ఆది హీరోగా ఈవారం విడుద‌లైన గాలిప‌టం ప్రేక్షకుల మనసుదోచుకుందట. ఆది, ఎరికా ఫెర్నాండేజ్‌, క్రిస్టినా అఖీవా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి న‌వీన్ గాంధీ ద‌ర్శకుడు. గాలిప‌టం స‌క్సెస్ మీట్ సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. టీమ్ అంతా త‌మ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సంద‌ర్భంగా ఆది మాట్లాడుతూ ''గత నా రెండు సినిమాలు న‌న్ను బాగా నిరాశ ప‌రిచాయి. గాలిప‌టం మాత్రం.. న‌మ్మకం క‌లిగిచింది. ఓ కొత్తర‌కం సినిమా ఇది. రోజు రోజుకీ వ‌సూళ్లు పెరుగుతున్నాయి. ఈ విజ‌యం అంద‌రిదీ” అన్నాడు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ బాగున్నాయి..నిర్మాత‌గా తొలి ప్రయ‌త్నంలోనే విజ‌యం సాధించ‌డ౦ సంతోషంగా వుందని సంపత్ నంది అన్నారు.