English | Telugu

గద్దర్ అవార్డులకి ముహూర్తం ఖరారు.. ఈ సారి స్పెషల్ ఇదే 

-గద్దర్ అవార్డ్స్ హంగామ
-ఈ సారి ఎవరు అదృష్టవంతులు
-పీరియడ్ ఇదే

తెలుగు చలన చిత్రపరిశ్రమకి చెందిన మేకర్స్ , హీరో, హీరోయిన్స్ తో పాటు మొత్తం 24 క్రాఫ్ట్స్ లో సందడి వాతావరణం మొదలైంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్(Gaddar Awards)అందుకు వేదిక కానుండగా గద్దర్ అవార్డ్స్ అందుకోవాలనే సినీ ఆశావాహులు కూడా పెరగనున్నారు. ఈ మేరకు గద్దర్ అవార్డ్స్ పై ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి అధికార ప్రకటన వచ్చింది. గద్దర్ అవార్డ్స్ యొక్క విధి విధానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి.

2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు నిర్మించిన చిత్రాలకి గద్దర్ అవార్డ్స్ఇవ్వనున్నారు.పరిశ్రమలోని 17 విభాగాలతో పాటు వ్యక్తిగత విభాగంలోను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలియచేసింది. రేపటి నుంచి ఈనెల 31 వరకు దరఖాస్తులని .స్వీకరించనున్నట్టుగా అధికారకంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి గద్దర్ అవార్డ్స్ ని అందుకొనే సినీ అదృష్టవంతులు ఎవరో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం