English | Telugu

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందా! ఫాతిమా సనా షేక్ అసలు నిజం చెప్పింది

బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్(Amir Khan)కెరీర్లోనే ఇప్పటి వరకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ 'దంగల్'(Dangal). ఈ మూవీలో అమీర్ పెద్ద కూతురు 'గీతా పొగట్' క్యారక్టర్ లో నటించి అశేష ప్రేక్షాభిమాన్ని పొందిన నటి ఫాతిమా సనా షేక్(Fatima sana Shaikh). దంగల్ కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఫాతిమా ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. తెలుగులో కూడా 'నువ్వు నేను ఒక్కటవుదాం' అనే మూవీలో హీరోయిన్ గా చేసి తన సత్తా చాటింది.

రీసెంట్ గా ఫాతిమా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తం కాస్టింగ్ కౌచ్ ఉంటుందని నేను చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను ఆ మాట అనలేదు. అక్కడ నాకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మాత్రమే చెప్పాను. అలాంటిది నా వ్యాఖ్యల్ని ఎందుకు తప్పుగా అర్ధం చేసుకున్నారో తెలియదు. సినిమా రంగమే కాదు ప్రతి రంగంలోను మహిళలకి అలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి చిన్నస్థాయి కాస్టింగ్ ఏజెంట్ లేదా నిర్మాత అయిఉండవచ్చు. అంతే గాని పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశ్యం కాదని చెప్పుకొచ్చింది.

ఫాతిమా కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. సినిమా కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధమా అని కాస్టింగ్ ఏజెంట్ అడిగేవాడు. మొదట ఆ మాట ఉద్దేశ్యం అర్ధం కాకపోయినా, అదే మాటని పదే పదే అడగడటంతో విషయం అర్ధమయ్యింది. హైదరాబాద్ లో కొంత మంది నిర్మాతలు హీరోయిన్స్ తో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా మాట్లాడుతుంటారని చెప్పుకొచ్చింది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.