English | Telugu

మ‌హేష్‌ని అంత మాటంటాడా??

తేజ‌ది కాస్త త‌ల‌తిక్క వ్య‌వ‌హార‌మే. కంట్రోల్‌లో ఉండి మాట్లాడ‌డం చేత కాదు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ని ప‌ట్టుకొని నోటుకొచ్చిన‌ట్టు మాట్లాడాడు. మ‌హేష్‌.. ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకొన్న‌ది టాక్స్‌లో బెనిఫెట్ కోస‌మే అంటూ ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశాడు. ''ఒక్క‌డు సినిమా హిట్ట‌యిన‌ప్పుడే.. ఊర్ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌చ్చు క‌దా, ఇప్పుడు తీసుకోవ‌డంలో ఆంత‌ర్యం ఏంటి? గ‌వ‌ర్న‌మెంట్లు టాక్స్ లో ఏదో బెనిఫిట్ ఇస్తామ‌ని చెప్పుంటారు'' అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్య టాలీవుడ్‌లో దుమారం రేపుతోంది.

మ‌హేష్ ఫ్యాన్స్ తేజ అంటే మండిప‌డుతున్నారు. నిజానికి మ‌హేష్‌, తేజ‌ల మ‌ధ్య మంచి బంధ‌మే ఉంది. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో నిజం వ‌చ్చింది. ఆ సినిమా హిట్టు కాక‌పోయినా మ‌హేష్‌కి ఉత్త‌మ‌న‌టుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ సినిమా గురించి తేజ ద‌గ్గ‌ర ఎప్పుడు ప్ర‌స్తావించినా కాస్త అంసంతృప్తితోనే మాట్లాడేవాడు. రాంగ్ టైమ్ లో తీసిన సినిమా అని చెప్తుండేవాడు. మ‌హేష్ తో ఎంత అవినావ‌భావ సంబంధం ఉన్నా, ఇద్ద‌రూ ఎంత క్లోజ్ అయినా ఇలాంటి కామెంట్లు చేయ‌డం మాత్రం భావ్యం కాదు.

ఎందుకంటే.. ఊరి ద‌త్త‌త అనేది ఓ ఉద్య‌మంగా న‌డుస్తున్న రోజులివి. ఓ హీరో వ‌ల్ల ఓ ఊరు బాగుప‌డినా చాలు కదా. దాన్నీ ఇలా భూత‌ద్దాల్లో పెట్టుకొని చూడ‌డం ఎందుకు? మ‌రి ఈ కామెంట్ల ప‌ట్ల మ‌హేష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.